A place where you need to follow for what happening in world cup

- Advertisement -

పారడైజ్’లో కేసీఆర్ పాత్రలో అదరగొట్టిన ప్రియదర్శికి ఘన సత్కారం

0 48

‘పారడైజ్’లో కేసీఆర్ పాత్రలో అదరగొట్టిన ప్రియదర్శికి ఘన సత్కారం
– చిర్ర రవీందర్ యాదవ్ ఆత్మీయ అభినందన

సైబరాబాద్ – విశాల భారతి
‘పారడైజ్’ చిత్రంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శికి ఘన సత్కారం లభించింది.బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిర్ర రవీందర్ యాదవ్ తమ నివాసంలో ప్రియదర్శిని ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహూకరించి అభినందించారు.ఈ సందర్భంగా చిర్ర రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ మట్టి వాసనను, పల్లె జీవన విధానాన్ని కళ్లకు కట్టిన ‘మల్లేశం’, ‘బలగం’ వంటి చిత్రాల్లో ప్రియదర్శి కనబరిచిన నటనా ప్రతిభ అమోఘమన్నారు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని వెండితెరపై ఆవిష్కరించే కళాకారులకు ఎల్లప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.
.

Leave A Reply

Your email address will not be published.