A place where you need to follow for what happening in world cup

- Advertisement -

పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

0 26

పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి

విశాల భారతి, షాద్ నగర్:మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు.షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి ఒక్కరూ, మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలతో ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, తమతో పాటు ఇతర అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వీర్లపల్లి శంకర్ కోరారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను ఆయన విజ్ఞప్తి చేశారు.
అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హ పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునాయక్ పురుషోత్తం రెడ్డి బాలరాజ్ గౌడ్ ఇబ్రహీం చందు నాయక్ రాయికల్ శ్రీనివాస్ కుమార్ గౌడ్ చంద్రశేఖర్ బాదేపల్లి సిద్ధార్థ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, కౌన్సిలర్ పెంటయ్య డిప్యూటీ సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.