పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా
– కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
విశాల భారతి, షాద్ నగర్:
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.షాద్నగర్ పట్టణానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు, ఫరూక్నగర్ మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు.
ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా…
పేద,మధ్యతరగతి కుటుంబాలకు తమ ఆడబిడ్డల వివాహాలు ఆర్థికంగా భారంగా మారకుండా ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తోందని, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం..
తమ కుమార్తెల వివాహాల కోసం ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, తహసిల్దార్ నాగయ్య,, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, మున్సిపల్ కౌన్సిలర్ దిలీప్ , మురళీ మోహన్ (అప్పి), ముబారక్ అలీ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్ , భాగ్యలక్ష్మి, నీళ్ళ రవీందర్ గౌడ్,మంగ మధు, మంగ అశోక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
