షాద్ నగర్ లో దొంగల హల్ చల్..
– తిరుపతి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా చోరీ
– రూ.4 లక్షల నగదు, 5 తులాల బంగారం, అర్ధ కిలో వెండి అపహరణ
– సంఘటన స్థలాన్ని పరిశీలించిన క్రైమ్ ఎస్సై శివారెడ్డి
విశాల భారతి,షాద్ నగర్:ల్
తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కుటుంబాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రయాణానికి కావాల్సిన సామగ్రిని సర్దుకుని నిద్రపోగా, ఇదే అదునుగా భావించిన దొంగలు కిరాణా షాపు లో చోరీకి పాల్పడ్డారు.రూ.4 లక్షల నగదు, ఐదు తులాల బంగారం, అర్ధ కిలో వెండిని అపహరించుకుపోయారు. ఈ ఘటన షాద్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. క్రిస్టియన్ కాలనీకి చెందిన సత్యం సంధ్య కిరణం షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులు తిరుపతి యాత్రకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రయాణ సామగ్రిని సిద్ధం చేసుకుని రాత్రి నిద్రపోయారు.అయితే తెల్లవారుజామున సంధ్యాకిరణం షాపు వద్దకు వెళ్లి చూసిన సమయంలో నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్లు గుర్తించినట్లు సమాచారం.
చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితుడు సత్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న క్రైమ్ ఎస్సై శివ రెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.తిరుపతి యాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలోనే చోరీ జరగడంతో బాధిత కుటుంబం ఆవేదనకు గురయ్యారు..
