హైదర్‌నగర్ ఈద్గాలో వర్షాల కోసం ప్రత్యేక దువా
కూకట్‌పల్లి,విశాల భారతి
వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ హైదర్‌నగర్ ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హైదర్‌నగర్ గ్రామంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక నమాజ్‌కు మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మౌలానాలు ప్రత్యేక దువా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు కాటకాలు రాకుండా ప్రజలను అల్లా కాపాడాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం పెద్దలు నార్నె శ్రీనివాసరావును శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ఎంఎస్ఎన్ మార్బుల్స్ అండ్ గ్రానైట్ అధినేత హబీబ్, మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ ఫసియుద్దీన్, యాసీన్ తదితరులు, ముస్లిం నాయకులు, పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
