గచ్చిబౌలిలో విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
– డ్రీమ్ ప్రైడ్ హోటల్‌పై పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దాడి
– నిర్వాహకులు, విటుడు సహా ఆరుగురు అదుపులో
సైబరాబాద్ – విశాల భారతి
గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్ కేంద్రంగా విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు సంయుక్తంగా హోటల్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్‌రెడ్డితో పాటు విటుడు హర్షిత్ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారంలో ఉన్న ముగ్గురు విదేశీ మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విచారణలో ప్రధాన నిర్వాహకుడైన నిఖిల్ ఢిల్లీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హోటల్‌లోని వేర్వేరు గదుల్లో విదేశీ మహిళలను ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన ముగ్గురు మహిళలు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వారిగా నిర్ధారించారు. కొద్దిరోజుల క్రితమే వారు ఉజ్బెకిస్తాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.దాడి సమయంలో ఘటనాస్థలం నుంచి 23 ఉపయోగించిన కండోమ్‌లు, రూ.13 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మహిళల వద్ద పాస్‌పోర్టులు,వీసాలు చెల్లుబాటులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో వ్యభిచార కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
