A place where you need to follow for what happening in world cup

- Advertisement -

చందానగర్‌లో మెడికల్‌ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

0 144

చందానగర్‌లో మెడికల్‌ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం
– రూ.కోటి విలువైన వైద్య పరికరాలు దగ్ధం
– నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటల అదుపు

సైబరాబాద్ – విశాల భారతి
చందానగర్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయి అనురాగ్‌ హాస్పిటల్‌ పక్కనే ఉన్న సర్జికేర్‌ షాపి మెడికల్‌ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో గోడౌన్‌లోని వైద్య పరికరాలు, సర్జికేర్‌ సామగ్రి పెద్దఎత్తున దగ్ధమైనట్లు సమాచారం.పటాన్‌చెరు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 12 గంటల ప్రాంతంలో గోడౌన్‌ నుంచి మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించి, కొంతసేపటికి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
గోడౌన్‌ యజమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రమాదంలో దాదాపు రూ.కోటి విలువైన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, సర్జికేర్‌ వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండొచ్చా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై గోడౌన్‌ యజమాని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.