A place where you need to follow for what happening in world cup

- Advertisement -

డీఎస్పీ భీమిరెడ్డి బినామీల ఇళ్లపై ఏసీబీ దాడులు

0 46

డీఎస్పీ భీమిరెడ్డి బినామీల ఇళ్లపై ఏసీబీ దాడులు
– డీఎస్పీ భీమిరెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఆరా
– పంచవటి కాలనీలో కొనసాగుతున్న సోదాలు

సైబరాబాద్ – విశాల భారతి
డీఎస్పీ భీమిరెడ్డికి సంబంధించినట్లు అనుమానిస్తున్న బినామీలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ సిటీ రేంజ్‌–2 డీఎస్పీ గంగసాని శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి.సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలోని పంచవటి కాలనీలో అనుమానితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, భూములు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. డీఎస్పీ భీమిరెడ్డితో బినామీలకు ఉన్న సంబంధాలు, వారి పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.సోదాల్లో లభించే పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు వెల్లడించే వివరాలతో ఈ వ్యవహారంలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.