వినాయక మండపంలో చోరీ
– లడ్డూ.. నగదు అపహరణ.. సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు
సైబరాబాద్ – విశాల భారతి
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాన్నే లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. చందానగర్ హుడా కాలనీలోని తేజ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండపంలో ఉంచిన లడ్డూతో పాటు నగదును గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకెళ్లాడు.మండపంలో చోరీ జరిగిన విషయం గుర్తించిన అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ప్రణాళికతోనే దుండగుడు మండపంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా, చోరీకి సంబంధించిన దృశ్యాలు మండపం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
