హైదర్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
– కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
– మద్యం సేవించినట్లు సమాచారం
సైబరాబాద్ – విశాల భారతి
హైదర్‌నగర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని భానువర్ధన్ (27)గా పోలీసులు గుర్తించారు.
భానువర్ధన్ శుక్రవారం రాత్రి హైదర్‌నగర్‌లోని తన స్నేహితుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో అకస్మాత్తుగా కిందపడిపోయినట్లు సమాచారం. దీంతో స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు, క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భానువర్ధన్ మృతికి అనారోగ్యమా, మద్యం ప్రభావమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
