A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ప్రజల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం

0 32

ప్రజల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం
– సైబరాబాద్‌ సీపీ డా. ఎం. రమేష్‌

సైబరాబాద్‌, విశాల భారతి
ప్రజల సంక్షేమం, భద్రత, అభివృద్ధే ప్రజాపాలనకు ప్రధాన లక్ష్యమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. ఎం. రమేష్‌ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా, బాధ్యతాయుతంగా సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణతోపాటు మహిళలు, బాలికలు, వృద్ధులు, వలస కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకం, సహకారం బలోపేతమైతే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు.కార్యక్రమంలో అడ్మిన్‌ డీసీపీ అన్నపూర్ణ, ఎస్‌బీ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర, హెడ్‌క్వార్టర్స్‌ డీసీపీ సంజీవ్‌, అడిషనల్‌ డీసీపీ షమీర్‌తోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.