తప్పిపోయిన చిన్నారి గంటలోనే క్షేమంగా అప్పగింత
తప్పిపోయిన చిన్నారి గంటలోనే క్షేమంగా అప్పగింత
– సీసీటీవీ కెమెరాల సాయంతో ఆచూకీ గుర్తించిన పోలీసులు
సైబరాబాద్ – విశాల భారతి
ఇంటి నుంచి తప్పిపోయిన 9 ఏళ్ల చిన్నారిని జీడిమెట్ల పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లికి అప్పగించారు. సరితా పాండే తన కుమార్తె లక్ష్మీ పాండే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంటి వద్ద కనిపించడం లేదని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించారు. పోలీసుల తక్షణ స్పందన, సమన్వయంతో కేవలం గంట వ్యవధిలోనే లక్ష్మీ పాండే ఆచూకీని గుర్తించారు. అనంతరం చిన్నారిని క్షేమంగా ఆమె తల్లి సరితా పాండేకు అప్పగించారు. తన కుమార్తెను అతి తక్కువ సమయంలోనే సురక్షితంగా గుర్తించి అప్పగించిన జీడిమెట్ల పోలీసులకు సరితా పాండే కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తక్షణ స్పందనపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.
