డ్యాన్స్ షో విజేత రాజుపై లైంగిక వేధింపుల కేసు
– బాధితురాలి ఫిర్యాదుతో మియాపూర్ పోలీసుల కేసు నమోదు
– మూడు రోజుల తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
సైబరాబాద్ – విశాల భారతి
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ–10’ విజేత రాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9న పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల అనంతరం రాజును అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు, ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
.
