వినాయక చవితి.. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
* గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సైబరాబాద్ – విశాల భారతి
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో జగద్గిరిగుట్ట పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లందరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గొడవలకు దిగినా, చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఎస్హెచ్ఓ ఎన్. సురేష్ హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా రౌడీషీటర్లను బైండోవర్ చేశారు.
