A place where you need to follow for what happening in world cup

- Advertisement -

దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్

0 109

దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్
– స్పీకర్‌ నిర్ణయం కొట్టివేత.. ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశం

హైదరాబాద్‌- విశాల భారతి
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను తిరస్కరిస్తూ శాసనసభ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశించింది. దానం నాగేందర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ నుంచి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారంటూ అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో దానం నాగేందర్‌ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave A Reply

Your email address will not be published.