A place where you need to follow for what happening in world cup

- Advertisement -

హైదర్‌నగర్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు

0 68

హైదర్‌నగర్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు
– కాంగ్రెస్ సీనియర్ నేత పోతుల రాజేందర్ పటేల్ ఆధ్వర్యంలో పంపిణీ

హైదర్‌నగర్,విశాల భారతి

హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఆయన వివరించారు.పోతుల రాజేందర్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, అర్హులైన కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, షరీఫ్, చాట్ల రవి, ఎండీ యాసిన్, హబీబ్, ఫసియుద్దిన్ , చంద్రయ్య, బ్రహ్మయ్య, నరసింహ, సూర్యనారాయణ రెడ్డి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.