A place where you need to follow for what happening in world cup

- Advertisement -

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారులు

0 372

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారులు
– అక్రమ నిర్మాణంపై చర్యలు నిలిపివేసేందుకు రూ.75 వేలు డిమాండ్‌
– సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

సైబరాబాద్ – విశాల భారతి
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసిన మోయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎలమొని సుదర్శన్‌ ఏసీబీకి చిక్కారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పి సిటీ రేంజ్‌–2 గంగసాని శ్రీధర్ బృందం బుధవారం పక్కా ప్రణాళికతో వలపన్ని సుదర్శన్‌ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న భవనంపై నోటీసులు, ఇతర చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వాణి రూ.75 వేలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని సుదర్శన్‌ ద్వారా తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. మోయినాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో సుదర్శన్‌ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.