A place where you need to follow for what happening in world cup

- Advertisement -

వీఆర్‌కే డైట్‌పై పోలీస్ కేసు

0 50

వీఆర్‌కే డైట్‌పై పోలీస్ కేసు
– ఇన్సులిన్‌ నిలిపివేయించడంతో ఆరోగ్యం విషమించిందని ఫిర్యాదు
– రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

సైబరాబాద్ – విశాల భారతి
ప్రముఖ కీటో డైటీషియన్‌ వీరమాచినేని రామకృష్ణ నిర్వహిస్తున్న వీఆర్‌కే హెల్త్‌ కేర్‌ సెంటర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. టైప్‌-1 మధుమేహంతో బాధపడుతున్న కల్లెడ సాయికృష్ణ (30) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మధుమేహం పూర్తిగా నయమవుతుందని హామీ ఇచ్చి తనతో ఇన్సులిన్‌ వినియోగాన్ని నిలిపివేయించారని సాయికృష్ణ ఆరోపించారు. వీఆర్‌కే డైట్‌ పేరుతో కొన్ని సప్లిమెంట్లను కూడా సూచించినట్లు తెలిపారు. అనంతరం తన ఆరోగ్యం తీవ్రంగా విషమించి డయాబెటిక్‌ కెటోయాసిడోసిస్‌కు గురయ్యానని, చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీఆర్‌కే హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో సేవలు అందిస్తున్న వారి విద్యార్హతలు, వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాధితుడికి అందించిన చికిత్సలో వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఆయన వైద్య రికార్డులను ప్రభుత్వ వైద్య నిపుణులకు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. నిపుణుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.