A place where you need to follow for what happening in world cup

- Advertisement -

శ్రీరామ్‌నగర్‌ లో రూ.2.10 లక్షలకు గల్లి గణేశుడి లడ్డూ కైవసం

0 7

శ్రీరామ్‌నగర్‌ లో రూ.2.10 లక్షలకు గల్లి గణేశుడి లడ్డూ కైవసం
–  21 కిలోల లడ్డూను వేలంలో దక్కించుకున్న సాయి హర్ష బిల్డర్స్‌ అధినేత బలరాం యాదవ్‌

సైబరాబాద్ – విశాల భారతి
శ్రీరామ్‌నగర్‌ కాలనీలోని గల్లి గణేశ్‌ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. గణనాథుడికి నైవేద్యంగా సమర్పించిన 21 కిలోల లడ్డూ వేలంలో పలువురు భక్తులు పోటీపడ్డారు. చివరకు సాయి హర్ష బిల్డర్స్‌ అధినేత బలరాం యాదవ్‌ రూ.2,10,116లకు లడ్డూను వేలం పాటలో కైవసం చేసుకున్నారు.
వేలం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీగా వేలం పాట పాడారు. లడ్డూను దక్కించుకున్న బలరాం యాదవ్‌ మాట్లాడుతూ గణేశుడి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములు, కాలనీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు, కాలనీ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వాహకులు బలరాం యాదవ్‌ను అభినందించి లడ్డూను అందజేశారు. కాలనీ వాసులు, భక్తులు వేలం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.