A place where you need to follow for what happening in world cup

- Advertisement -

గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం

0 14

గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం
– సత్యం, అహింసా మార్గాలను ఆచరించాలి
– సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్

సైబరాబాద్-విశాల భారతి
జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, క్రమశిక్షణ మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు, పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు న్యాయం చేయడం, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం, సమాజ సేవకు అంకితభావంతో పనిచేయడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని తెలిపారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, శాంతియుత, సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్, హన్మంత్ రావుతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.