A place where you need to follow for what happening in world cup

- Advertisement -

భవానీ మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

0 53

భవానీ మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
– ఎలికట్ట భవానీ మాత ఆలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు
– పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే

విశాల భారతి, షాద్‌నగర్
భవానీ మాత కృపాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, షాద్‌నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. ఎలికట్ట గ్రామంలోని శ్రీ భవానీ మాత ఆలయాన్ని సందర్శించిన ఆయన, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొని ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.
ఎలికట్టలోని శ్రీ భవానీ మాత ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్‌లకు ఆలయ నిర్వాహకులు, భక్తులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. పల్లకీ సేవలో పాల్గొని భక్తిభావాన్ని చాటుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నియోజకవర్గంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవకిరణి నర్సింహ, పట్టణ సీఐ సీతారాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, గిరిజన ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్, మాజీ ఎంపీపీ మంచనపల్లి శివశంకర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఫరూఖ్‌నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, అంబటి ప్రభాకర్, శ్రీశైలం, తాలూకా ఎస్సీ సెల్ చైర్మన్ జాంగారి రవి, లింగారెడ్డిగూడ ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్, మనీష్, నీరటి వాసు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.