A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఆరు మీటర్లకు రూ.1.20 లక్షలు!

0 16

ఆరు మీటర్లకు రూ.1.20 లక్షలు!
– లంచం తీసుకుంటూ విద్యుత్‌ ఏఈ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన వైనం

హైదరాబాద్-విశాల భారతి
ఆరు విద్యుత్‌ మీటర్ల మంజూరుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన TGSPDCL అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఏసీబీ వలకు చిక్కారు. లంచం సొమ్ము స్వీకరిస్తుండగా ఏఈ పండాల సంధ్యా రాకేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిటీ రేంజ్‌–2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.సంతోష్‌నగర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మాదన్నపేట సెక్షన్‌లో ఏఈగా పనిచేస్తున్న పండాల సంధ్యా రాకేష్‌ వద్దకు ఓ వ్యక్తి పాత విద్యుత్‌ మీటర్లు తొలగిపోవడంతో కొత్తగా ఆరు మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆమోదించి కొత్త మీటర్లు మంజూరు చేసేందుకు రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.ఏఈ లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. బుధవారం లంచం సొమ్ము స్వీకరిస్తున్న సమయంలో ఏఈ రాకేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.నిందితుడిని నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.