A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సద్దుల బతుకమ్మకు పటిష్ఠ బందోబస్తు

0 13

సద్దుల బతుకమ్మకు పటిష్ఠ బందోబస్తు
– మల్కం చెరువు బేబీ పాండ్‌ వద్ద పోలీసుల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

సైబరాబాద్ – విశాల భారతి
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కం చెరువు బేబీ పాండ్‌ వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ తోట భూపతి తెలిపారు.బతుకమ్మ వేడుకలకు మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందిని మోహరించి, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తోట భూపతి తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.