A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన చిర్రా రవీందర్ యాదవ్

0 19

కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి-విశాల భారతి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చిర్రా రవీందర్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని కేటీఆర్‌ సూచించినట్లు రవీందర్‌ యాదవ్‌ తెలిపారు.
కేసీఆర్‌ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.