కేటీఆర్‌కు రవి యాదవ్ దసరా శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి-విశాల భారతి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మరబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో కొద్దిసేపు ముచ్చటించి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని రవి యాదవ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని అన్నారు. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
