A place where you need to follow for what happening in world cup

- Advertisement -

శుద్ధిచేసిన నీటి నాణ్యతపై నిరంతర నిఘా

0 32

శుద్ధిచేసిన నీటి నాణ్యతపై నిరంతర నిఘా
– కోకాపేట ఫిల్లింగ్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన వాటర్‌బోర్డు ఎండీ కె.అశోక్‌రెడ్డి

సైబరాబాద్ – విశాల భారతి
శుద్ధి చేసిన నీటి నాణ్యత, సరఫరా పరిమాణంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వాటర్‌బోర్డు ఎండీ కె.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కోకాపేటలోని గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. నీటి నాణ్యత పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించి, ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ట్యాంకర్లలో నీటి పరిమాణాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఫిల్లింగ్‌ మార్కులు ఏర్పాటు చేయాలని, ప్రతి ట్యాంకర్‌ నంబర్‌, నింపిన పరిమాణం వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నిర్మాణ రంగం, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, పార్కులు, తోటల నిర్వహణకు శుద్ధి చేసిన నీటిని వినియోగించి తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించాలని అశోక్‌రెడ్డి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.