A place where you need to follow for what happening in world cup

- Advertisement -

దుర్గామాత పూజల్లో డీసీపీ శ్రీనివాస్

0 27

దుర్గామాత పూజల్లో డీసీపీ శ్రీనివాస్
– బజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

సైబరాబాద్ – విశాల భారతి
బజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో డీసీపీ సీహెచ్‌. శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత పందిరిని సందర్శించిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుప్రజ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల వివరాలను సభ్యులు డీసీపీకి వివరించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను డీసీపీ అభినందించారు. పందిరి వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.పండుగల సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని డీసీపీ సీహెచ్‌. శ్రీనివాస్‌ సూచించారు. నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉత్సవాల సమయంలో భద్రతా నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డీసీపీ సీహెచ్‌. శ్రీనివాస్‌ను బజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు తుడి సాకేత్‌, సతీష్‌, మహీందర్‌, బాబ్లూ, కవిత, నరేష్‌, ప్రసాద్‌, కార్తీక్‌, నిఖిల్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.