ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా
– సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట
– షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
– విజయదశమి శమీ పూజలో పాల్గొన్న షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
విశాల భారతి, షాద్ నగర్
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలతో మమేకమవుతూ, స్థానిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతికి గౌరవం ఇస్తూ పండుగల సందర్భంగా ప్రజలతో కలిసి ఉండటం సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఫరూఖ్‌నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ షమీ పూజ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చింది. అనంతరం రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, ప్రముక్త వక్త భాస్కర్ యోగి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, బిజెపి నాయకులు అందే బాబయ్య, శ్రీవర్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి తదితరులున్నారు..
