పారిశుద్ధ్య కార్మికురాలికి రాంకీ సత్కారం
– ఆల్విన్ కాలనీ సర్కిల్-51లో కార్యక్రమం
– డీసీ చాముండేశ్వరి చేతుల మీదుగా బహుమతి అందజేత
సైబరాబాద్ – విశాల భారతి
ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కార్మికురాలిని రాంకీ సంస్థ మంగళవారం ఘనంగా సత్కరించింది.సర్కిల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీ చాముండేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్మికురాలికి శాలువా కప్పి బహుమతి అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణతో తోటి కార్మికులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె సేవలను రాంకీ ప్రతినిధులు అభినందించారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న డీసీ చాముండేశ్వరికి రాంకీ బృందం కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్య సాధనలో క్షేత్రస్థాయి కార్మికుల పాత్ర కీలకమని, వారిని ప్రోత్సహించడం అందరి బాధ్యత అని డీసీ పేర్కొన్నారు.
