మియాపూర్‌లో మాతృశ్రీ డీఏవీలో రక్తదాన శిబిరం
– 18న నిర్వహణ..తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవకులకు ఆహ్వానం
మియాపూర్ – విశాల భారతి
మియాపూర్‌లోని మాతృశ్రీనగర్ కాలనీలో ఉన్న మాతృశ్రీ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఈ నెల 18న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. అభ్యుదయ రోటరీ క్లబ్ సహకారంతో, ఆర్య యువ సమాజ్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. ఆనందవల్లి మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేయడానికి లేదా స్వచ్ఛంద సేవకులుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ వార్డు తరగతి ఉపాధ్యాయులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
