A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మాదకద్రవ్యాలపై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం  

0 123

మాదకద్రవ్యాలపై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం

– రూ.5 కోట్ల విలువైన 833 కిలోల డ్రగ్స్ దహనం
– 8వ విడతలో 101 కేసుల సరుకు ధ్వంసం
– డీసీపీ ముత్యంరెడ్డి

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 101 ఎన్‌డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన రూ.5.02 కోట్ల విలువైన 833.118 కిలోల మాదకద్రవ్యాలను శనివారం దహనం చేశారు.సీపీ ఎం. రమేశ్ ఆదేశాలతో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, డీసీపీ ఏ. ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో నందిగామ మండలం ఎదులపల్లిలోని జీజే మల్టీక్లేవ్ సంస్థలో పర్యావరణ నిబంధనల ప్రకారం ఇన్సినరేటర్‌లో ధ్వంసం చేశారు.ధ్వంసం చేసిన మాదకద్రవ్యాల్లో 797 కిలోల 841 గ్రాముల గంజాయి, 7 కిలోల 970 గ్రాముల అల్ప్రజోలం, 1 కిలో 658 గ్రాముల హాషిష్ ఆయిల్, 24 కిలోల 640 గ్రాముల గంజా చాక్లెట్లు, 912 గ్రాముల గంజా మొక్కలు, 92 గ్రాముల చరస్, 0.005 గ్రాముల ఎండీఎంఏ ఉన్నాయి. మొత్తం 7 రకాల డ్రగ్స్‌ను 8వ విడతలో భాగంగా దహనం చేశారు.డ్రగ్స్ రహిత సమాజం కోసం కఠిన చర్యలు కొనసాగిస్తాం’ అని డీసీపీ ముత్యంరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.