మియాపూర్‌లో ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు
– పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాలకు వినతులు
సైబరాబాద్ – విశాల భారతి
మియాపూర్ సర్కిల్ 48 పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఆరు ఫిర్యాదులు అందాయి. వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
అందిన ఫిర్యాదుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి మూడు వినతులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగానికి రెండు ఫిర్యాదులు అందగా.. పట్టణ జీవనోపాధి అభివృద్ధి విభాగానికి ఒక ఫిర్యాదు వచ్చింది.
రెవెన్యూ, ఆరోగ్యం–పారిశుద్ధ్యం, విద్యుత్, నీటిపారుదల, పశుసంవర్ధక తదితర విభాగాలకు ఈ ప్రజావాణిలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. మొత్తం ఆరు ఫిర్యాదులను అధికారులు స్వీకరించి, సంబంధిత విభాగాలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.
విభాగాల వారీగా ఫిర్యాదులు
పట్టణ ప్రణాళిక విభాగం – 3
రెవెన్యూ విభాగం – 0
ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 0
పట్టణ జీవనోపాధి అభివృద్ధి విభాగం – 1
ఇంజినీరింగ్ విభాగం – 2
పట్టణ జీవ వైవిధ్య విభాగం – 0
విద్యుత్ – 0
నీటిపారుదల – 0
పశుసంవర్ధక – 0
ఇతర విభాగాలు – 0
మొత్తం ఫిర్యాదులు – 6
