కళకు ‘నృత్య దేవ అర్చన’ నీరాజనం
– శాస్త్రీయ నృత్యాలతో కొండాపూర్‌లో సాంస్కృతిక సందడి
– యువ కళాకారుల ప్రతిభకు వేదికగా ట్రస్ట్ సేవలు
సైబరాబాద్ – విశాల భారతి
భారతీయ శాస్త్రీయ నృత్య వైభవాన్ని చాటేలా డొయన్స్ కాలనీలోని నారాయణీ నాట్యాలయ ట్రస్ట్ ‘నృత్య దేవ అర్చన’ 2వ వార్షిక వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించింది.ఈ వేదికపై మహతి భిక్షూ కూచిపూడి, సబర్నిక్ డీ ఒడిస్సీ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘సంప్రదాయ నృత్యాలను భావితరాలకు అందించడం, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల యువ కళాకారులకు ప్రదర్శన అవకాశాలు కల్పించడమే మా ధ్యేయం’ అని ట్రస్ట్ వ్యవస్థాపకుడు, భరతనాట్య గురువు సంతోష్ కుమార్ తమాంగ్ పేర్కొన్నారు.
