A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కైతలాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలికోట శంకర్ 

0 74

కైతలాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలికోట శంకర్
– బండి రమేష్ ఆశీస్సులతో బాధ్యతల స్వీకరణ
– రేవంత్ బాటలో సేవ చేస్తానని వెల్లడి

కూకట్ పల్లి – విశాల భారతి
కైతలాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా కలికోట శంకర్ నియమితులయ్యారు. కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్ ఆదేశాల మేరకు ఆయన ఈ పదవి చేపట్టారు.శనివారం బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సీనియర్ నాయకుల మద్దతుతో తనను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు బండి రమేష్‌కు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.బండి రమేష్ అడుగుజాడల్లో నడుస్తూ, రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తా. ప్రజా సేవకు ఎప్పుడూ వెనుకాడను’ అని శంకర్ అన్నారు. కార్యక్రమంలో మొఇజ్, యూత్ ప్రెసిడెంట్ సలీం, సుల్తాన్, శ్రవణ్, బాలకృష్ణ, నరేందర్, చిన్న, గౌస్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.