A place where you need to follow for what happening in world cup

- Advertisement -

హోప్ అన్నదానం.. ఆగని సేవా ప్రవాహం 

0 54

హోప్ అన్నదానం.. ఆగని సేవా ప్రవాహం
– 191 వారాలుగా చందానగర్‌లో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ
– అన్నార్తులకు ఆశాకిరణంగా నిలుస్తున్న ఫౌండేషన్

శేరిలింగంపల్లి – విశాల భారతి
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా హోప్ ఫౌండేషన్ చేపట్టిన అన్నదాన యజ్ఞం 191వ వారానికి చేరింది. ప్రతి శనివారం నిర్విరామంగా కొనసాగుతున్న ఈ సేవ ఎందరో అన్నార్తులకు ఆశాకిరణంగా మారింది.శనివారం చందానగర్‌లో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వందలాది మంది భోజనం చేశారు. ఎలాంటి విరామం లేకుండా 191 వారాలుగా సేవ చేయడం అభినందనీయమని స్థానికులు అన్నారు.ఆకలితో వచ్చిన వారి కడుపు నింపి, వారి ముఖాల్లో ఆనందం చూడటమే మా లక్ష్యం’ అని హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.