ఆదిబట్ల, విశాలభారతి: ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని మృతహాన్ని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ సమీపంలో ఔటర్ ఏక్సిట్ 12 నుండి ఆదిబట్ల వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో ఆదిభట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మహేశ్వరం అదనపు డీసీపి సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపి రాజు, అధిబట్ల సిఐ రవికుమార్, సిబ్బంది.
