A place where you need to follow for what happening in world cup

- Advertisement -

హైదరాబాద్‌లో పాలనా సంస్కరణల దిశగా సరికొత్త ముందడుగు

0 156

హైదరాబాద్‌లో పాలనా సంస్కరణల దిశగా సరికొత్త ముందడుగు
– జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి
– ​నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించిన “కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్ ) బిల్లు.
– 2026”.. జూలై 24లోగా ప్రజా సూచనలకు అవకాశం

​సైబరాబాద్ – విశాల భారతి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పాత మున్సిపల్ పరిపాలనా పద్ధతులకు స్వస్తి పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాల కాలం నాటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి) చట్టం స్థానంలో, కాలపరీక్షకు తట్టుకుని నిలబడేలా విప్లవాత్మక మార్పులతో సరికొత్త కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్ ) బిల్లు, 2026 ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలు, ప్రజా రవాణా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.​కీలక మార్పులు సులభతర పాలన ​నగర పాలనను మరింత సరళతరం చేయడంతో పాటు, పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించడం, ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించారు. పాత చట్టంలో ఉన్న లొసుగులను తొలగిస్తూ, నగరంలో వ్యాపారాల సరళీకరణ (ఈస్ అఫ్ డూయింగ్ బిజినెస్ )కు పెద్దపీట వేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.