అమ్మ పేరుతో ఒక మొక్క
– ఫతేనగర్‌లో ‘హర్ మా కె నామ్ పే ఏక్ పెడ్’
– మొక్కలు నాటిన బీజేపీ నేతలు
కూకట్ పల్లి – విశాల భారతి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ మా కె నామ్ పే ఏక్ పెడ్’ కార్యక్రమం ఫతేనగర్‌లో ఘనంగా జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్, మైనారిటీ మోర్చా నాయకులు నాసిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగన్‌మోహన్ సింగ్, ఉపాధ్యక్షులు షాజహాన్ హాజరయ్యారు.ముందుగా నేతలు ఫతేనగర్‌లోని అరబ్ షా బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక మసీదు సమీపంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
