ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు గాయం
– పరామర్శించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా
సైబరాబాద్ – విశాల భారతి
కేటీఆర్ కన్నెపల్లి పర్యటనలో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఛాతికి బలమైన గాయమైంది. ప్రమాదవశాత్తు గాయపడటంతో ఆయన ప్రస్తుతం నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా శంబీపూర్ రాజు నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులు సూచించిన విశ్రాంతి తీసుకుంటూ, సూచనలు పాటిస్తున్నట్లు రాజు సాయిబాబాకు వివరించారు.కన్నెపల్లి పర్యటనలో జరిగిన ఈ ఘటనపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శంబీపూర్ రాజు త్వరగా కోలుకుని ప్రజా సేవలో మళ్లీ పాల్గొనాలని సాయిబాబా ఆకాంక్షించారు. ఈ పరామర్శలో పలువురు స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు.
