A place where you need to follow for what happening in world cup

- Advertisement -

శేరిలింగంపల్లిలో ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ 

0 96

శేరిలింగంపల్లిలో ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
– జెండా ఆవిష్కరించిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
– హాజరైన నవీన్ ఆచారి, నేతలు, కార్యకర్తలు

సైబరాబాద్ – విశాల భారతి
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘జెండా పండుగ’ కార్యక్రమం శేరిలింగంపల్లిలో ఘనంగా జరిగింది. లింగంపల్లి రైతుబజార్ వద్ద వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ ప్రసాద్ జెండా ఎగురవేసి కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, వాసిలి నివేదిత, నరేష్, కిషోర్, లావణ్య బండారి, విష్ణు చారీ, కవిత, మాధవి, కుమార్ యాదవ్, సందీప్, షేక్ అస్లాం, ప్రవీణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం జై తెలంగాణ నినాదాలతో సందడిగా సాగింది. అనంతరం చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ, కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. జెండా పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.