శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు
– ఒడిసి, భరతనాట్యంతో ఆకట్టుకున్న కళాకారులు
సైబరాబాద్ – విశాల భారతి
మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ఆహ్లాదంగా సాగాయి. కోల్‌కతా నుంచి విచ్చేసిన ఒడిసి కళాకారుడు సబార్నిక్ డే మంగళాచరన్, హంసధ్వని పల్లవి, జయదేవ అభినయ, మోక్ష అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించాడు.అనంతరం సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి కౌతం, సరస్వతి శబ్దం, నాతనం ఆదినార్, ఆనంద నాతనం ప్రకాశం, దేవి కీర్తనం, చంద్రమువలె, జావళి అంశాలను దివ్య నితిన్, భావన, హరిణి, హర్షిత, లక్ష్మి కార్తీక్, మౌనిక, యోహాన, ఉర్విజ, సౌమ్య, సోమా, రుచిత కళాకారులు ప్రదర్శించి అలరించారు. కార్యక్రమానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
.
