ప్రజా సేవే లక్ష్యంగా…
– మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత గొడుగులు
సైబరాబాద్ – విశాల భారతి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు తన చేతుల మీదుగా గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళల ఇబ్బందులను గుర్తించి గొడుగులు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు తగినట్లు సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యత అని తెలిపారు. వర్షాకాలంలో మహిళలు, చిన్నారులు తడవకుండా ఉండేందుకే ఈ గొడుగుల పంపిణీ చేపట్టామని, భవిష్యత్తులోనూ ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిర్యాల రాఘవరావు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, స్థానిక మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గొడుగులు అందుకున్నారు. ఎమ్మెల్యేతో కలిసి మహిళలు గొడుగులు పట్టుకొని ఆనందం వ్యక్తం చేశారు.
