పదవీ విరమణ పొందిన పోలీసులకు ఘన వీడ్కోలు
– సైబరాబాద్ సీపీ రమేష్ సత్కారం
సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం 14 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందారు. సీపీ డాక్టర్ ఎం. రమేష్ వారిని శాలువాలు, పూలమాలలతో సత్కరించి పెన్షన్ పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.సీఐ సెల్ ఎస్‌ఐ జాకీర్ హుస్సేన్, సీటీసీ ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, షాబాద్ ఎస్‌ఐ శంకర్ రెడ్డి, సనత్‌నగర్ ఎస్‌ఐ నాగరాజులు, పీసీఆర్ ఎస్‌ఐ షేక్ షబుద్దీన్, రామచంద్రాపురం ఎస్‌ఐ నారాయణ గౌడ్, షీ టీమ్స్ ఎస్‌ఐ శ్రీనివాస్, ఆమనగల్ ఎస్‌ఐ సీతారాం రెడ్డి, ఏఎస్‌ఐలు మురళీధర్, మాణిక్ రెడ్డి, ఏఆర్‌ఎస్‌ఐలు సుబ్బరాయుడు, మాణిక్ రెడ్డి, పీసీ లక్ష్మణ్ నాయక్, హెచ్‌జి నగేష్ పదవీ విరమణ పొందారు.సీపీ మాట్లాడుతూ, సుదీర్ఘకాలం శాఖకు సేవలందించి ప్రజల భద్రతకు కృషి చేశారని కొనియాడారు. కుటుంబ సభ్యుల త్యాగం అభినందనీయమన్నారు. విశ్రాంత జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. డీసీపీలు అన్నపూర్ణ, సుధీంద్ర, ముత్యం రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
