పారిశుధ్యంపై ఆల్విన్ కాలనీ సర్కిల్ డీసీ స్పెషల్ ఫోకస్
– శాతవాహననగర్‌లో ఇంటింటి చెత్త సేకరణ తనిఖీ
– ఈఎఫ్‌ల పంపిణీ పనులనూ పరిశీలించిన చాముండేశ్వరి
సైబరాబాద్ – విశాల భారతి
ఆల్విన్ కాలనీ సర్కిల్ 51లో బుధవారం ఉదయం పారిశుధ్యంపై డీసీ చాముండేశ్వరి ప్రత్యేక దృష్టి సారించారు. హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లో ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతుందో స్వయంగా పరిశీలించారు. అనంతరం సెవెన్‌హిల్స్ బాగ్యనగర్ డివిజన్ లో బీఎల్‌ఓ సిబ్బందితో కలిసి ఈఎఫ్‌ల పంపిణీ తీరును తనిఖీ చేశారు. ఓటరు నమోదు ప్రక్రియలో అలసత్వం వద్దని, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు కూడా సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు.
