చెత్త ఇవ్వని ఇళ్లకు రెడ్ నోటీసులు
– ఎస్‌ఏటీ ఆటో డ్రైవర్లతో నోటీసుల అంటింపు
– ఎస్‌ఆర్‌పీలతో జరిమానాలు: జీవీపీల తొలగింపునకు చర్యలు
జగద్గిరిగుట్ట – విశాల భారతి
ఇంటింటి చెత్త సేకరణకు సహకరించని గృహ యజమానులకు ఇకపై రెడ్ నోటీసులు అంటించనున్నారు. జగద్గిరిగుట్టలో బుధవారం ఎస్‌ఏటీ ఆటో డ్రైవర్లు చెత్త ఇవ్వని ఇళ్లకు రెడ్ నోటీసులు అంటించారు. ఇది మంచి ఆలోచనని, దీంతో జీవీపీల తొలగింపునకు, రోడ్లపై చెత్త నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఎస్‌ఏటీ ఆటో ఓనర్లు చెత్త ఇవ్వని ఇళ్లను గుర్తించి రెడ్ నోటీసులు అంటిస్తారని, ఆ తర్వాత ఎస్‌ఆర్‌పీలు సంబంధిత గృహాలకు జరిమానాలు విధిస్తారని వివరించారు. అవసరమైతే ఎస్‌ఏటీ ఆటోలను అటాచ్ చేసే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. రేపటి నుంచి ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
