శంషాబాద్ సమీపంలో బొలెరో బీభత్సం
– బస్‌స్టాప్‌లో ఇద్దరు మహిళల దుర్మరణం
రాజేంద్రనగర్ – విశాల భారతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్‌స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బొలెరో ఒక్కసారిగా స్కిడ్ అయి రహదారి పక్కన ఉన్న బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న ఇద్దరు మహిళలు వాహనం కింద నలిగిపోయారు.ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
