జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ర్యాలీ
జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ర్యాలీ
మియాపూర్ – విశాల భారతి
జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మియాపూర్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పసుపు రంగు టీషర్టులు ధరించి, కాషాయ జెండాలు చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు.జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం” అని పేర్కొన్న బ్యానర్‌తో ర్యాలీ చేపట్టిన విద్యార్థులు దేశభక్తి, విద్యార్థి చైతన్యానికి సంబంధించిన నినాదాలు చేశారు. ర్యాలీకి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావన, సామాజిక బాధ్యత పెంపొందించడమే జాతీయ విద్యార్థి దినోత్సవం నిర్వహణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యా రంగంలోని సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులను సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
