A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పీటీ ఉష 

0 184

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పీటీ ఉష
– గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యిపెసు ప్రారంభోత్సవంపై చర్చ

సైబరాబాద్ – విశాల భారతి
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ `#YIPESU` ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పీటీ ఉష, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, స్పోర్ట్స్ మౌలిక సదుపాయాల కల్పన, యిపెసు యూనివర్సిటీ ద్వారా యువ క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అవకాశాలపై ఇరువురూ చర్చించారు. క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పీటీ ఉష అభినందించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులకు స్ఫూర్తినిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.