ఒవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాలపై ధిక్కరణ నోటీసులు
సైబరాబాద్ – విశాల భారతి
సల్కం చెరువులో ఒవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా పలువురు ఉన్నతాధికారులకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
