డి మార్ట్ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన
– సురక్షా కా తిరంగా కార్యక్రమంలో భాగంగా 80 మంది ఉద్యోగులకు అవగాహన
మియాపూర్ – విశాల భారతి
మియాపూర్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో ‘సురక్షా కా తిరంగా’ అవగాహన కార్యక్రమంలో భాగంగా డి మార్ట్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 80 మంది ఉద్యోగులకు ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, యూపీఐ, క్యూఆర్ కోడ్, ఫిషింగ్, నకిలీ లింకులు, కేవైసీ, డిజిటల్ అరెస్ట్ తదితర మోసాలపై వివరించారు. ఓటీపీ, పాస్‌వర్డ్, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ జయరాం, విజయ నాయక్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
